రాహుల్‌ టూర్‌: తన్నుకున్న ఓయూ స్టూడెంట్స్‌ 

OU Students Fight at Haritha Hotel Over Rahul Tour - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రెండో రోజు పర్యటనలో గందరగోళం చోటుచేసుకుంది. హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన సీనియర్‌ నేతలతో సమావేశం రసాభసగా మారింది. ముఖ్యనేతల జాబితాలో సీనియర్‌ నేత జానారెడ్డి పేరు లేకపోవడంతో ఆయన షబ్బీర్‌ అలీలు అలిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. దీంతో గూడూరు నారయణ రెడ్డి బుజ్జగించి లోపలికి పంపించారు. ఇక రేవంత్‌ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు సైతం చేదుఅనుభవం ఎదురైంది. సీనియర్ల మీటింగ్‌ లోపలికి వెళ్లడానికి రేవంత్‌ రెడ్డికి పాస్‌ నిరాకరించగా.. సునీతా లక్ష్మారెడ్డిని అనుమతించలేదు. దీంతో ఆమె కంట తడిపెట్టారు.

ఉస్మానియా విద్యార్థుల భేటీలో సైతం గొడవ చోటుచేసుకుంది. కొందరికి అనుమతి లేదనడంతో రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు హోటల్‌లోనే కొట్టుకున్నారు. ఈ గొడవతో విద్యార్థులతో రాహుల్‌ భేటీ రద్దైంది.

చదవండి: టీడీపీతో పొత్తు అవకాశాలు: రాహుల్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top