లోక్‌సభలో రిజర్వేషన్ల బిల్లు.. టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేసీఆర్‌ సూచన

NDA Govt Introduced Reservation Bill In Lok Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లట్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు 124వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ముందుకు తీసుకువచ్చింది. బిల్లుపై చర్చించిన అనంతరం ఉభయ సభలు 2/3 వంతు మెజార్టీతో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. లోక్‌సభలో బీజేపీ స్పష్టమైన మెనార్టీ ఉన్నందున బిల్లు సునాయాసంగా ఆమోదం పొందవచ్చు. అసలు పరీక్ష రాజ్యసభలో ఎదురుకానుంది. ఎగువ సభలో అధికార పక్షానికి సరిపడ బలం లేనందున విపక్షాలు పలు సవరణలు డిమాండ్‌ అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పట్టిన బిల్లుపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఏవిధంగా వ్యవహరించాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ వారికి దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ శాసనసభ ఆమోదించిన ముస్లిం, మైనార్టీ రిజర్వేషన్ల బిల్లును కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే విధంగా మోదీని కోరాలని సూచించారు. దీంతో ముస్లింలకు 12శాతం, ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్ల కొరకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top