వరుసగా ఐదోసారి సీఎంగా నవీన్‌..! | Naveen Patnaik Bleeding In Odisha Assembly Elections | Sakshi
Sakshi News home page

వరుసగా ఐదోసారి సీఎంగా నవీన్‌..!

May 23 2019 4:52 PM | Updated on May 23 2019 4:54 PM

Naveen Patnaik Bleeding In Odisha Assembly Elections - Sakshi

భువనేశ్వర్‌: ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బీజూ జనతాదళ్‌ (బీజేడీ) రికార్డు విజయం దిశగా కొనసాగుతుంది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేడీ 104 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 29, కాంగ్రెస్‌ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా వరుసగా ఐదోసారి బీజేడీ అధికారంలోకి రానుంది. దీంతో ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్‌ పట్నాయక్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ స్థానాలకు  ఒకేసారి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం కొనసాగినప్పటికీ  ఒడిశాలో మాత్రం నవీన్‌ నాయకత్వాన్ని బీజేపీ ఢీకొనలేకపోయింది. లోక్‌సభ స్థానాల్లో కూడా బీజేడీ హవా కొనసొగుతోంది. మొత్తం 21 లోక్‌సభ స్థానాలు గల ఒడిశాలో బీజేడీ 14, బీజేపీ 7 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా నవీన్‌ పట్నాయక్‌ నాయకత్వంలో నాలుగోసారి బీజేపీ అధికారంలోకి రానుంది. 2004లో 61, 2009లో 103, 2014లో 117 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కూడా అదే ఊపును కొనసాగిస్తూ.. 100 స్థానాలకు పైగా విజయం సాధించే విధంగా బీజేడీ పయనిస్తోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement