ఆర్కేకు నారా లోకేష్‌ అభినందనలు

Nara Lokesh Wishes YSRCP Leader Alla Ramakrishna Reddy - Sakshi

సాక్షి, అమరావతి : మంగళగిరి నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌బాబు అభినందనలు తెలియజేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై అత్యంత విశ్వాసంతో ఓట్లు వేసిన ప్రజలందరికి ఆయన నమస్కారాలు తెలిపారు. నామినేష‌న్ వేసిన నాటినుంచి కౌంటింగ్ వ‌ర‌కు అహ‌ర్నిశ‌లు తన కోసం శ్ర‌మించిన తెలుగుదేశం పార్టీ నాయ‌కులకు, కార్య‌క‌ర్త‌లకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. తొలిసారి ఎన్నిక‌ల‌లో పోటీచేసిన తనకు మ‌ద్ద‌తుగా నిలిచిన ప్ర‌తీ ఒక్క‌రికి పేరుపేరునా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నానన్నారు.

మీడియా మిత్రుల స‌హ‌కారం మ‌రువ‌లేనిదన్నారు. ఎన్నిక ప్ర‌క్రియ‌ ప్రశాంతంగా సాగేందుకు స‌హ‌క‌రించి, ప్ర‌జాస్వామ్య స్ఫూర్తిని చాటిన మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అందరూ ఆద‌ర్శంగా నిలిచారని పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గ పార్టీ నాయ‌కులకు, కార్య‌క‌ర్త‌ల‌కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. మంగ‌ళ‌గిరి అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్ర‌జ‌ల్లో ఉంటూ ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాడ‌తానని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top