కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. టీఆర్‌ఎస్‌లోకి మరో ఎమ్మెల్యే

Nakrekal MLA Announce Leave Congress And Join In TRS - Sakshi

పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన చిరుమర్తి లింగయ్య

సాక్షి, హైదరాబాద్‌:  లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. నకిరేకల్‌ శాసన సభ్యుడు చిరుమర్తి లింగయ్య పార్టీని వీడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్‌ను రాజీనామా చేసి త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు లింగయ్య వెల్లడించారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టీఆర్‌ఎస్‌ బీ ఫాంపై పోటీచేసి మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసినా కాంగ్రెస్‌ నేతల్లో మార్పు రావడంలేదని లింగయ్య విమర్శించారు. నల్గొండ జిల్లా అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని, అందుకే పార్టీలో చేరుతున్నానని పేర్కొన్నారు.  ఈమేరకు శనివారం ఆయన బహిరంగ లేఖను విడుదల చేశారు.

‘టీఆర్‌ఎస్‌లో చేరితే అంతకన్నా మోసం​ ఇంకోటి లేదు’

కేసీఆర్‌ అభివృద్ధిని ప్రజలు గుర్తించి గత ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించారని, కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు చిరుమర్తి లింగయ్య అభిప్రాయపడ్డారు. అభివృద్ధికి ఆటంకం కలిగే విధంగా కాంగ్రెస్‌ నేతలు కోర్టుల్లో కేసులు వెయ్యడం తప్ప చేసింది మరొకటి లేదని అన్నారు. కాగా పార్టీని వీడుతున్నట్లు ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకటించిన విషయం తెలిసిందే. రేగా కాంతారావు, ఆత్రం సక్కు త్వరలోనే కారెక్కుతున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీకి ఈపరిణామం పెద్ద షాకే. చిరుమర్తి లింగయ్య ప్రకటనతో కాంగ్రెస్‌ పార్టీని వీడేవారి సంఖ్య ముగ్గురికి చేరింది. టీడీపీ నుంచి గెలిచిన సత్తుపల్లి శాసన సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆయనకు టికెట్‌ రాకపోతే.. నేను పోటీ చేయను..!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top