సీఎం మాటిచ్చారు.. టికెట్‌ మాకే | Musheerabad Ticket Confirmed To Nayini Narasimha Reddy | Sakshi
Sakshi News home page

సీఎం మాటిచ్చారు.. టికెట్‌ మాకే

Sep 15 2018 8:30 AM | Updated on Oct 20 2018 5:03 PM

Musheerabad Ticket Confirmed To Nayini Narasimha Reddy - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న హోంమంత్రి నాయిని

హైదరాబాద్‌ : ముషీరాబాద్‌ నియోజకవర్గం నుండి టికెట్‌ను మాకే కేటాయిస్తారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట ఇచ్చారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.  గురువారం బాగ్‌లింగంపల్లిలోని సాయిబాబా ఆలయం వద్ద  గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం బాబా ఆలయంలో విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో  తనకు గానీ, తన అల్లుడు కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌ రెడ్డికి పార్టీ తరపున టికెట్‌ కేటాయిస్తున్నట్లు సీఎం నుండి స్పష్టమైన హామీ లభించిందన్నారు. ఇక్కడి టికెట్‌ను అడగడంలో న్యాయం, హక్కు రెండూ ఉన్నాయన్నారు.  తొలిదశ 105 టికెట్ల పంపిణీలో తమకు ముందువరుసలో రావాల్సినప్పటికీ జాప్యం జరిగిన మాట వాస్తవమేనన్నారు. జిహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు వి. శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఆశీర్వాదంతో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. నాయకులు ప్రకాష్‌ రెడ్డి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ధర్మరాజు గౌడ్, పాశం శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement