వైఎస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి | MP Peddireddy Mithun Reddy Fires On CM Chandrababu | Sakshi
Sakshi News home page

Jun 8 2018 11:48 AM | Updated on Aug 14 2018 11:26 AM

MP Peddireddy Mithun Reddy Fires On CM Chandrababu - Sakshi

ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్‌ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పచ్చి అబద్దాలకోరు అని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాల గురించి అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటని మిథున్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

ప్రత్యేక హోదా కోసం నాలుగు సంవత్సరాలుగా పోరాటం ఎవరు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని ఎంపీ పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితోలో లేరని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు ఒక్క అవకాశం ఇస్తే పాలన అంటే ఎలా ఉండాలో చూపిస్తారని ప్రజలను ఎంపీ మిథున్‌ రెడ్డి కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement