పచ్చ మీడియాకు ఎన్నికల లేఖ ఎందుకు పంపారు! | Mopidevi Venkata Ramana Slams EC Ramesh Kumar In Guntur | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు కోవర్ట్‌గా పనిచేస్తున్నారు..

Mar 19 2020 2:04 PM | Updated on Mar 19 2020 3:48 PM

Mopidevi Venkata Ramana Slams EC Ramesh Kumar In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : ఎన్నిక కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ వ్యవహారశైలిపై అనేక అనుమానాలున్నాయని మంత్రి మోపిదేవి వెంకట రమణ పేర్కొన్నారు. రమేష్‌ కుమార్‌ తన ఈమెయిల్‌ నుంచి పచ్చ మీడియాకు ఎన్నికల లేఖ ఎందుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయిల్‌ ద్వారా పచ్చ మీడియాతో కొంత సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై రమేష్‌ కూమార్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎన్నికలను వాయిదా వేసే ముందు కనీసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని ఆయనకు తెలీదా అని నిలదీశారు. (ఎన్నాళ్లు తప్పించుకుంటావ్ బాబూ? )

ఈ మొత్తం వ్యవహారం వెనుక రమేష్‌ కుమార్‌ పక్షపాత వైఖరి ఉందని మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్‌ ముసుగులో చంద్రబాబుకు కోవర్ట్‌గా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి కమిషనర్‌తో ఎన్నికలు సజావుగా జరుగుతాయని తమకు నమ్మకం లేదని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం చొరవ తీసుకొని రమేష్‌ కుమార్‌ను కమిషనర్‌గా తొలగించాలని, మంచి సమర్థుడైన అధికారిని నియమించాలని కేంద్రానికి సూచించారు. (ఈసీ లేఖపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement