టీడీపీ నేతలు ‘గడ్డి’ని కూడా వదల్లేదు..

Minister Mopidevi Venkata Ramana slams TDP leaders - Sakshi

పశుసంవర్ధక శాఖలో బయటపడ్డ కోడెల కుటుంబం అవినీతి

పశువుల మందుల సరఫరాలో అక్రమాలు

సాక్షి, అమరావతి: పశువుల మందుల సరఫరాలో అక్రమాలపై పశు సంవర్థకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి మాట్లాడుతూ... ’టీడీపీ నేతలు దేనిని వదలకుండా అవినీతికి పాల్పడ్డారు. పశువులకు సరఫరా చేసే గడ్డిని కూడా వదలకుండా దోచుకున్నారు. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు పశువుల మందులు, గడ్డిలోనూ అవినీతికి పాల్పడటం సిగ్గుచేటు మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరామ్‌ కంపెనీల పేరుతో అవినీతికి పాల్పడ్డారు. అయిదు కంపెనీల కోసం అక్రమంగా టెండర్ల నిబంధనలు మార్చేసి అవినీతికి పాల్పడ్డారు. రూ.4.5కోట్ల వరకూ వాళ్లకి చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేయాలని ఆదేశించాను. అయిదేళ్లలో జరిగిన అవినీతిని వెలికి తీస్తాం. ఇప్పుడు పూర్తి పారదర్శకంగా టెండర్లు పిలుస్తాం.’  అని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top