నిఖిల్‌పై తీవ్రంగా పోరాడుతున్న సుమలత!

Mandya Lok Sabha Election Results Updates - Sakshi

కర్ణాటకలో బీజేపీ సంచలనం

బెంగళూరు: కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం దిశగా సాగుతోంది. అధికార కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి గట్టి షాక్‌ ఇస్తూ.. కమలం పార్టీ రాష్ట్రంలో ఏకంగా 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కర్ణాకటలో 28 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఎవరూ ఊహించనిరీతిలో బీజేపీ అత్యధిక స్థానాలను సొంతం చేసుకునే దిశగా సాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ కేవలం మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఆ పార్టీ మిత్రపక్షమైన జేడీఎస్‌ ఒకే ఒక్క స్థానంలో లీడింగ్‌లో ఉంది. జేడీఎస్‌ ప్రధాన నేతలు, వారసులు సైతం వెనుకంజలో ఉండటం గమనార్హం. 

జేడీఎస్‌ అధినేత దేవెగౌడ మనవడు, సీఎం కరుణానిధి కొడుకు నిఖిల్‌ గౌడ మాండ్య నియోజకవర్గంలో ఎదురీదుతున్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ నటి సుమలత ప్రస్తుతం 1200 ఓట్ల మెజారిటీతో స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. దివంగత కన్నడ రెబల్‌ స్టార్‌ అంబరీష్‌ సతీమణి అయిన సుమలత భర్త మృతి నేపథ్యంలో ఇక్కడ బరిలోకి దిగారు. ఇక, బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రిజ్వన్‌ అర్షద్‌, బీజేపీ నుంచి పీసీ మోహన్‌ మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా కౌంటింగ్‌ సాగుతోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top