
సాక్షి, హైదరాబాద్: అర్ధరాత్రి ఆందోళనల కేసులో నిందితుడిగా ఉన్న మందకృష్ణ మాదిగ బుధవారం సికింద్రాబాద్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు తీరుపై మండిపడ్డారు. గవర్నర్‌ను కలిసి చట్టం దొరలకు చుట్టం ఎందుకు అయిందో ప్రశ్నిస్తామని ఆయన అన్నారు. గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. సినీ గ్లామర్ అడ్డం పెట్టుకొని తిరిగితే పవన్ కల్యాణ్‌కు ఓట్లు పడవని అన్నారు. ఒకవైపు తమను అడ్డుకోవడానికి పోలీసులు ఉపయోగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అదే సమయంలో పవన్ తిరగడానికి వారిని పెడుతోందని విమర్శించారు.