అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి..

majji srinivasa rao fird on tdp leaders - Sakshi

టీడీపీ పాలనకు చరమగీతం పాడే సమయం దగ్గర్లో ఉంది..

వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ, వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు

పార్టీలో వంద కుటుంబాల చేరిక

శృంగవరపుకోట రూరల్‌: టీడీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ అసంతృప్తితో ఉన్నారని, అవినీతి పాలనకు చరమగీతం పాడే సమయం దగ్గర్లోనే ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ, వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తెలిపారు. మండలంలోని ఎస్‌.కోట తలారి గ్రామంలో రంధి అనంత్‌ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సభలో తలారి, ఉసిరి, చుక్కవానిపాలెం గ్రామాలకు చెందిన వంద కుటుంబాలు టీడీపీ, బీజేపీని వీడి శ్రీనివాసరావు సమక్షంలో వైఎసాŠస్‌ర్‌సీపీలో చేరాయి. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రతిపక్ష పార్టీ జెండాతో గెలిచిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం సిగ్గు చేటన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు మోసపూరిత హామీలతో గెలిచారని చెప్పారు. పతంజలి సంస్థకు వేల ఎకరాలు కట్టబెట్టిన చరిత్ర బాబుదేనన్నారు. పతంజలిలో ఉన్న డైరెక్టర్లు, హెరిటేజ్‌లో ఉన్న డైరెక్టర్లు ఒకరు కారా అని ప్రశ్నించారు. రాజన్న రాజ్యం అంటే సంక్షేమ రాజ్యమని..అది ఒక్క జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. 

ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమిటి?
ఎస్‌.కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చేసిన అభివృద్ధి ఏమీ లేదని శ్రీనివాసరావు అన్నారు. ప్రతిపక్ష పార్టీ అడ్డుకోవడం వల్లే అభివృద్ధి నిలిచిపోతుందని ఎమ్మెల్యే అనడం సిగ్గుచేటన్నారు. మీ హయాంలో బొద్దాంలో కాలువ తవ్వకుండా బిల్లులు బొక్కేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హయాంలో రూ.35 కోట్లతో తాటిపూడి పంట కాలువల అభివృద్ధితో పాటు ఎస్‌.కోట నియోజకవర్గ గ్రామాలకు తాటిపూడి జలాశయ బ్యాక్‌ వాటర్‌ నుంచి తాగునీటి ప్రాజెక్టు మంజూరు చేసిన విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. అలాగే మూతపడిన గోల్డ్‌స్టార్‌ను తెరిపించారని.. మా మహామాయ, శారడ స్టీల్‌ కంపెనీల ఏర్పాటు చేయించిన విషయాన్ని మరిచారా అని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ విషయంలో కేంద్రమంత్రి అశోక్‌ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం మాట్లాడుతూ, గోతులు పడిన ఎస్‌.కోట పట్టణ రహదారి చూస్తుంటే తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ఏమిటో కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ నెక్కల నాయుడుబాబు మాట్లాడుతూ, వైఎస్‌ జగన్మోహనరెడ్డి సీఎం అయిన మరుక్షణం ‘నవరత్నాల పథకాలు’తో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని చెప్పారు. సభలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, పార్టీ నేతలు గుడివాడ రాజేశ్వరరావు, వేచలపు చినరామునాయుడు, పాండ్రంకి సంజీవి, గొర్లె రవి, మెరపుల సత్యనారాయణ, సింగంపల్లి సత్యం, గొర్లె సూరిబాబు, రంధి అనంత్, తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నేతలు షేక్‌ రెహ్మాన్, దాసరి పార్వతి, వాకాడ రాంబాబు, పినిశెట్టి వెంకటరమణ, ముమ్ములూరి స్వామినాయుడు, చామలాపల్లి బుజ్జిపంతులు, గాడి అప్పలనాయుడుతో పాటు ఎస్‌.కోట, వేపాడ, జామి, కొత్తవలస, ఎల్‌.కోట, తదితర మండలాలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వంద కుటుంబాల చేరిక
పార్వతీపురం: మండలంలోని అడ్డాపుశీలకు  చెందిన వంద కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరాయి. శనివారం రాత్రి జరిగిన రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల్లో గ్రామానికి చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వీరికి పార్టీ అరుకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్‌ మజ్జి గౌరయ్యతో పాటు ఆయన అనుచరులు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర  ఎస్సీ సెల్‌ కార్యదర్శి గర్బాపు ఉదయభాను, అలజంగి జోగారావు, అడ్డాపుశీల మాజీ సర్పంచ్‌ వీటి సూర్యనారాయణ థాట్రాజ్‌ (బాచి), రామోలు రామకృష్ణ, అరసాడ మధు, భాస్కరరావు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top