వైఎస్సార్‌సీపీ హవా.. ఏకగ్రీవాల వెల్లువ!

Local Body Elections YSRCP Candidates Unanimous As MPTC And ZPTC - Sakshi

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దూసుకెళ్తోంది. నేటితో నామినేషన్ల గడువు ముగియడంతో రాష్ట్రంలోని చాలా చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమర్థవంతమైన పాలన నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారు. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. నియోజకవర్గం పరిధిలో ఉన్న 95 ఎంపీటీసీలకుగాను 86 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
(చదవండి: వలసలతో టీడీపీ కుదేలు..)

చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో సైతం 4 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాంతోపాటు చిత్తూరు జిల్లాలోని 65 జడ్పీటీసీలకుగాను 15 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా మొత్తంలో 858 ఎంపీటీసీలకుగాను 225 చోట్ల  వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక వైఎస్సార్‌ కడప జిల్లా చైర్మన్‌ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 50 జడ్పీటీసీలకుగాను 35 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటి నుంచి పార్టీకి సేవ చేస్తున్న ఆకెపాటి అమర్‌నాథ్‌ రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికవడం లాంఛనమే!
(చదవండి: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల)

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఏకగ్రీవాలు..

  • నెల్లూరు: 46 జడ్పీటీసీలకుగాను 12చోట్ల ఏకగ్రీవం.
  • గుంటూరు: జిల్లాలో ఉన్న 54 జడ్పీటీసీలకుగాను 8చోట్ల ఏకగ్రీవం, మాచర్ల నియోజకవర్గంలో 70 చోట్ల ఏకగ్రీవం.
  • వైఎస్సార్‌ కడప: 50 జడ్పీటీసీలకుగాను 35 చోట్ల ఏకగ్రీవం. జడ్పీ చైర్మన్‌ను కైవసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ.
  • కృష్ణా: మండవల్లి జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయనిర్మల ఏకగ్రీవం, గన్నవరం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దుట్టా సీతారామలక్ష్మి ఏకగ్రీవం.
  • పశ్చిమగోదావరి: ఏలూరు రూరల్‌ జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సరస్వతి ఏకగ్రీవం, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాబ్జి ఏకగ్రీవం.
  • కర్నూలు:  53 జడ్పీటీసీలకుగాను 14చోట్ల ఏకగ్రీవం, 805 ఎంపీటీసీలకుగాను 150చోట్ల ఏకగ్రీవం.
  • ప్రకాశం: 55 జడ్పీటీసీలకుగాను 11చోట్ల ఏకగ్రీవం.
  • శ్రీకాకుళం: 667 ఎంపీటీసీలకుగాను 48చోట్ల ఏకగ్రీవం.
  • టీడీపీ రాష్ట్రఅధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ సొంత మండలంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం, 12 ఎంపీటీసీలకుగాను 12 చోట్లా ఏకగ్రీవం.
  • విజయనగరం: 34 జడ్పీటీసీలకుగాను 3చోట్ల ఏకగ్రీవం, 549 ఎంపీటీసీలకుగాను 25 చోట్ల ఏకగ్రీవం.
  • విశాఖపట్నం: 39 జడ్పీటీసీలకుగాను ఒకచోట ఏకగ్రీవం. 651 ఎంపీటీసీలకుగాను 20 చోట్ల ఏకగ్రీవం.
  • తూర్పుగోదావరి: 1086 ఎంపీటీసీలకుగాను 30చోట్ల ఏకగ్రీవం.
  • అనంతపురం: 841 ఎంపీటీసీలకుగాను 41చోట్ల ఏకగ్రీవం.
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top