వైఎస్సార్‌ సీపీ అనంతపురం అభ్యర్థులు వీరే..

List Of Anatapur MLA Candidates Profile - Sakshi

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్సార్‌ సీపీ) నూతన అధ్యాయానికి తెరలేపింది. ఎన్నికల్లో తమ పార్టీ తరుఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పెద్ద పీట వేశారు. రిజర్వేషన్‌ ప్రాతిపదికన శింగనమల, మడకశిర నియోజకవర్గాలు ఎస్సీలకు కేటాయించగా.. మిగిలిన వాటిలో రాయదుర్గం, కళ్యాణదుర్గం, పెనుకొండ,  నియోజకవర్గ అభ్యర్థులుగా బీసీలను, హిందూపురం నుంచి ముస్లిం మైనారిటీ అభ్యర్థిని  ఎంపిక చేశారు. బరిలో నిలిచిన అభ్యర్థులందరూ ఉన్నత విద్యావంతులే.  

1.ధర్మవరం నియోజకవర్గం : కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 


పేరు: కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 
తండ్రి: కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
తల్లి           : కేతిరెడ్డి కళావతమ్మ
పుట్టిన తేది  : 13–10–1980
భార్య          : కేతిరెడ్డి సుప్రియ
కుమారుడు  : కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి
విద్యార్హత      : బీటెక్‌
రాజకీయ అనుభవం: 2006లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి హత్యకు గురికావడంతో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో  కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి జిల్లాలోనే అత్యధిక మెజారిటీ(16,000) సాధించిన వ్యక్తిగా నిలిచారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గుంతకల్లు రైల్వే డివిజన్‌ డీఆర్‌యుసీసీ, అటవీ అభివృద్ధి శాఖ, ప్రివిలేజ్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఆ తరువాత  2014 జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం ధర్మవరం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. 

2.పెనుకొండ నియోజకవర్గంమాలగుండ్ల శంకరనారాయణ

పూర్తి పేరు : మాలగుండ్ల శంకరనారాయణ

పుట్టిన తేదీ    : 01.01.1965
జన్మస్థలం    : ధర్మవరం
తల్లిదండ్రులు : వకీలు పెద్దయ్య, యశోదమ్మ
తమ్ముళ్లు    : రవీంద్ర, మల్లికార్జున
చదువు    : బీకాం, ఎల్‌ఎల్‌బి
వృత్తి     : న్యాయవాది
పెళ్లి     : 1988
భార్య     : జయలక్ష్మి
సంతానం    : పృథ్వీరాజ్, నవ్యకీర్తి (పెళ్లిళ్లయ్యాయి)
రాజకీయ అనుభవం : 1994లో టీడీపీ జిల్లా కమిటీ మెంబర్‌గా, ధర్మవరం నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. 2011లో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు.

3.మడకశిర నియోజకవర్గం: డాక్టర్‌ ఎం తిప్పేస్వామి

పేరు: డాక్టర్‌ ఎం తిప్పేస్వామి
గ్రామం    : ఉదుగూరు
మండలం    : అమరాపురం
తండ్రిపేరు    : ఎం. హనుమప్ప
భార్య పేరు    : ఏ.ఎస్‌.సత్యవాణి
పుట్టిన తేది    : 01–06–1953
వృత్తి    : వైద్యం
విద్యార్హత    : ఎంబీబీఎస్, ఎండీ, డీజీఓ
కుమారులు    : డాక్టర్‌ స్వామి దినేష్, స్వామి మహేష్, స్వామి రాజేష్‌
రాజకీయ అనుభవం: 1994లో పలమనేరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపో యారు. 1999లో అక్కడే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2008 వరకు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2009లో చిత్తూరు ఎంపీగా పోటీ చేసి ఓడి పోయారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున మడకశిరలో పోటీ చేసి ఓటమి చెందినా.. సుప్రీంకోర్టు తీర్పుతో 2018లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.

4.శింగనమల నియోజకవర్గంజొన్నలగడ్డ పద్మావతి

పేరు: జొన్నలగడ్డ పద్మావతి
తండ్రి : దివంగత జె. చెన్నకేశవులు 
తల్లి     : జె. నిర్మలాదేవి 
పుట్టిన తేదీ    : 18–06–1979
స్వగ్రామం     : నెల్లూరు
చదువు       : ఎంటెక్‌.,
భర్త     :  అలూరి సాంబశివారెడ్డి  (శింగనమల మండలం ఈస్ట్‌ నరసాపురం)
వృత్తి     :  లెక్చరర్‌ 
పెద్ద నాన్న    : వెంకయ్య రిటైర్డు ఐజీ 
సంతానం    : కుమారుడు విరాట్‌
రాజకీయ ప్రవేశం: 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి సాగునీటి  సాధనకు నియోజకవర్గంలో పాదయాత్ర, పింఛన్‌దారులకు న్యాయం చేయాలని తదితర ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటాలు చేశారు.   

5.పుట్టపర్తి నియోజకవర్గం: దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి

పేరు: దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి
తండ్రి పేరు: వెంకట్రామిరెడ్డి
గ్రామం    : నల్లసింగయ్యగారిపల్లి, నల్లమాడ మండలం
భార్య     : అపర్ణారెడ్డి
పుట్టిన తేది    : 27–5–1971
వృత్తి     : కాంట్రాక్టర్‌  (2001 దాకా కస్టమ్స్, సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖలో ఉద్యోగి)
విద్యార్హత     : ఎంఎస్సీ., 
సంతానం     :  కిషన్‌రెడ్డి, కుమార్తె ఈషారెడ్డి
రాజకీయ అనుభవం : 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున హిందూపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త కర్తగా కొనసాగుతున్నారు. 

6.ఉరవకొండ నియోజకవర్గం:  యల్లారెడ్డి గారి విశ్వేశ్వరరెడ్డి

పేరు: యల్లారెడ్డి గారి విశ్వేశ్వరరెడ్డి
పుట్టినతేది    : 25.02.1960
స్వగ్రామం    : రాకెట్ల, ఉరవకొండ మండలం 
తల్లిదండ్రులు: లలితమ్మ, నారాయణరెడ్డి
భార్య     : భువనేశ్వరి
సంతానం    : ప్రణయ్‌కుమార్‌రెడ్డి
విద్యాభ్యాసం:  ఎంఏ.,    
కుటుంబ సభ్యులు: ఒక అన్న, ఒక అక్క, ముగ్గురు తమ్ముళ్లు  
రాజకీయ అనుభవం : ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, సీపీఐ, సీపీఎం పార్టీల్లో పనిచేశారు. 2004లో కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఎం తరఫున ఉరవకొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2009లో మరోసారి ఓటమిపాలయ్యారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలుపొందారు. 

7.గుంతకల్లు నియోజకవర్గం: యల్లారెడ్డి వెంకటరామిరెడ్డి

పేరు: యల్లారెడ్డి వెంకటరామిరెడ్డి
తల్లిదండ్రులు    : వై. భీమిరెడ్డి, వై. లలితమ్మ
పుట్టిన తేదీ    : 01–06–1959
పుట్టిన ఊరు    : ఆదోని 
భార్య    : వై.శారద (గృహిణి)
కుమారులు    : లేరు
కుమార్తెలు    : నైరుతి, నిషిత 
విద్యార్హత     : బీఏ.,  
రాజకీయ నేపథ్యం: వై.వెంకటరామిరెడ్డి తండ్రి వై.భీమిరెడ్డి రైతు కుటుంబం. భీమిరెడ్డి  ఉరవకొండ ఎమ్మెల్యేగా పని చేసిన రాజకీయ అనుభవం ఉంది. సోదరులు శివరామిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి కూడా ఎమ్మెల్యేలుగా పని చేశారు. ఇక వై.వెంకటరామిరెడ్డి 2006లో కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా పని చేశారు. 2014 గుంతకల్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

8.తాడిపత్రి నియోజకవర్గం: కేతిరెడ్డి పెద్దారెడ్డి

పేరు: కేతిరెడ్డి పెద్దారెడ్డి
పుట్టిన తేది    :   01–06–1965
జన్మస్థలం    : తిమ్మంపల్లి, యల్లనూరు మండలం
తల్లిదండ్రులు :  కేతిరెడ్డి రామిరెడ్డి, చిన్ననాగమ్మ 
భార్య    : రమాదేవి
సంతానం    : హర్షవర్దన్‌రెడ్డి, సాయిప్రతాప్‌రెడ్డి
వృత్తి    : వ్యవసాయం
రాజకీయ అనుభవం : గతంలో యల్లనూరు ఎంపీపీగా పని చేశారు. 2016 నుంచి తాడిపత్రి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. 

9.రాయదుర్గం నియోజకవర్గంకాపు రామచంద్రారెడ్డి

పేరు: కాపు రామచంద్రారెడ్డి
తల్లిదండ్రులు :  కాపు గంగమ్మ, కాపు చిన్న తిమ్మప్ప 
విద్యార్హత       : ఎంకాం., (కర్ణాటక యూనివర్సిటీ) బీఎల్‌., ఐఎస్‌సీ (గుల్బర్గా యూనివర్సిటీ)  
పుట్టిన తేదీ : 06–10–1964 
వృత్తి             : న్యాయవాది 
భార్య     :  కాపు భారతి  
సంతానం:    ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, స్రవంతి 
రాజకీయ అనుభవం: వృత్తి రీత్యా న్యాయవాది. 2009లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి, అదే ఏడాది రాయదుర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌ సీపీలో చేరారు. 2012 జరిగిన ఉపఎన్నికల్లో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో అతి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. పలు సేవా కార్యక్రమాలకు తన సొంత నిధులు వెచ్చిస్తూ ప్రజాసేవలో కొనసాగుతున్నారు.

10.రాప్తాడు నియోజకవర్గం: తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

పేరు: తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
తల్లిదండ్రులు    :  ప్రేమకుమారి, ఆత్మారామిరెడ్డి 
భార్య    : మనోరమ
సంతానం    : సాయిసిద్ధార్థరెడ్డి,  ఇందిరాప్రియదర్శిని
పుట్టిన తేదీ    : 06–06–1973 
స్వస్థలం    : తోపుదుర్తి గ్రామం, ఆత్మకూరు మండలం 
విద్యార్హత    : బీఈ ( బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌)  
రాజకీయ అనుభవం: 2009లో కాంగ్రెస్‌ తరఫున రాప్తాడు అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రత్యర్థి పరిటాల సునీతపై తక్కువ ఓట్ల(1950)తో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో రాప్తాడు నుంచే పోటీపడగా పరిటాల సునీత చేతిలో 7774 ఓట్ల తేడాతో ఓటమిచెందారు. రెండు సార్లు ఓడిపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతోపాటు పార్టీలో చురుకైన నాయకుడిగా పేరుపొందారు.   

11.అనంతపురం నియోజకవర్గం: అనంత వెంకట్రామిరెడ్డి

పేరు: అనంత వెంకట్రామిరెడ్డి
తల్లిదండ్రులు : అనంత వెంకటసుబ్బమ్మ, అనంత వెంకటరెడ్డి 
పుట్టినతేది      : 01–08–1956 
విద్యార్హత      : ఎంఏ, బీఎల్‌ 
భార్య      : ఎ.రమా 
కూతుళ్లు      :  నందిత, నవ్యత 
సోదరులు     : అనంత సుబ్బారెడ్డి, అనంత చంద్రారెడ్డి 
వృత్తి     : న్యాయవాది
రాజకీయ అనుభవం: 1987 నుంచి 1996 వరకు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) ప్రధానకార్యదర్శిగా పని చేశారు. 1996, 1998, 2004, 2009లలో అనంతపురం పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌సీపీ తరఫున 2014లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షుడిగా, అనంతపురం అర్బన్‌ సమన్యయకర్తగా కొనసాగతున్నారు.  

12.కళ్యాణదుర్గం నియోజకవర్గం: ఉషశ్రీచరణ్‌ 

పేరు: ఉషశ్రీచరణ్‌ 
తల్లిదండ్రులు : రత్నమ్మ, కె.విరూపాక్షప్ప 
భర్త పేరు     : శ్రీచరణ్‌ 
పుట్టిన తేదీ    : 16–07–1976 
సంతానం     : కుమారుడు దివిజిత్‌ శ్రీచరణ్, కుమార్తె జయనా శ్రీచరణ్‌ 
విద్యార్హత     : ఎమ్మెస్సీ ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌   
వృత్తి     : వ్యాపారం 
రాజకీయ అనుభవం: 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 నుంచి కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్లుగా పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి లెక్కకు మించి ఉద్యమాలు చేపట్టారు. స్థానిక పార్టీ నాయకులతో పరిచయాలు పెంచుకుని, నియోజకవర్గ స్థితిగతులు, రాజకీయ పరిస్థితులతపై అవగాహన పొందారు.   

13.హిందూపురం నియోజకవర్గం: మహ్మద్‌ ఇక్బాల్‌

పేరు: మహ్మద్‌ ఇక్బాల్‌
తల్లిదండ్రులు: గౌస్‌సాహెబ్‌ , నిషాద్‌ జహాన్‌
సంతానం    : నిఖాద్‌ జహాన్‌
పుట్టినతేది    : 26.04.1958
విద్యార్హత     : ఎంఏ, పొలికటిల్‌ సైన్సు హిందూపురంలో ఎస్‌డీజీఎస్‌ కళాశాలలో  ఇంటర్‌(బైపీసీ) చదివారు.
ఉద్యోగం     : పోలీస్‌ శాఖలో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు
రాజకీయ రంగప్రవేశం : 2018 మే 16న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక. పోలీసు అధికారిగా పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు.    

14.కదిరి నియోజకవర్గం:  డాక్టర్‌ పెడబల్లి వెంకట సిద్దారెడ్డి

పేరు: డాక్టర్‌ పెడబల్లి వెంకట సిద్దారెడ్డి
తల్లిదండ్రులు: కమలమ్మ, చిన్న గంగిరెడ్డి
పుట్టిన తేదీ    : 04–08–1968
వయసు    : 51
భార్య    : డా.ఉషారాణి
పిల్లలు    : ఇద్దరు 1. ద్యుతి (యుఎస్‌ఏలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌)  2. ప్రణతి (మెడిసిన్‌ చదువుతోంది)
రాజకీయ అనుభవం: 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పీఆర్పీ తరపున పోటీ చేశారు.  తర్వాత వైఎస్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2014లో వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కదిరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చాంద్‌బాషాను గెలిపించుకోవడంలో ఈయన కీలక భూమికను పోషించారు. 2016 నుంచి∙వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేస్తున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top