సంక్రాంతి పూట ఝలక్‌

Leaders Join YSRCP In Srikakulam District - Sakshi

టీడీపీకి గుడ్‌బై చెప్పిన వేలాదిమంది నేతలు 

జిల్లాకు అన్యాయం చేస్తుండటంపై ఆవేదన  

మంత్రి ధర్మాన, స్పీకర్‌ తమ్మినేని సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక 

అమరావతి ముద్దు– వికేంద్రీకరణ వద్దు అనే నినాదంతో జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తున్న ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ విప్‌ కూన రవికుమార్‌కు ఆ పార్టీ నాయకులే షాక్‌ ఇచ్చారు. సంక్రాంతి పూట వారిద్దరికీ కోలుకోలేని దెబ్బకొట్టారు. వెనుకబడిన జిల్లాను ముందుకెళ్లకుండా తీరని ద్రోహం చేస్తున్న టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరారు. అన్ని ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి చేసేందుకు పరితపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉంటామంటూ వేలాది మంది సోమవారం వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్‌సీపీ గాలిలో కూడా కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. రిగ్గింగ్‌ తదితర ఆరోపణలు ఏమున్నప్పటికీ జిల్లాలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అటువంటి నాయకుడు ఎలా ఉండాలి. ప్రజల అభీష్టం మేరకు పనిచేయాలి. జిల్లా అభివృద్ధికి పాటుపడాలి. కానీ అచ్చెన్నాయుడు అందుకు విరుద్ధంగా జిల్లా ప్రజల మనోభావాలను ముఖ్యంగా నియోజకవర్గ ప్రజల ఆలోచనలకు భిన్నంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అజెండాను మోస్తున్నారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకర ణ జరిగితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ప్రగతి పథంలో నడుస్తాయన్న ఉద్దేశంతో మూడు రాజధానుల ప్రతిపాదనను తీ సుకొస్తే అదేదో తప్పు అన్నట్టుగా, రాష్ట్రానికి అన్యాయం చేసి నట్టుగా టీడీపీ అగ్రనేతలు ఆందోళనలు చేస్తున్నారు.

అమరావతిలో ఉన్న భూములను కాపాడుకునేందుకు, అక్కడున్న స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తూ వెనకబడిన ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారు. విశాఖపట్నం రాజధాని అయితే పక్కనున్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని ప్రజలంతా ఆశిస్తుంటే అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్న ఈ ధోరణి నచ్చని టీడీపీ శ్రేణులు తమకు రాజకీయ భవిష్యత్‌ లేకుండా చేస్తారన్న భయంతో పారీ్టకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో అచ్చెన్నాయుడుకు అండగా నిలిచిన టెక్కలి, సంత»ొమ్మాళి మండలాలకు చెందిన వెయ్యికి పైగా కుటుంబాలు టీడీపీకి స్వస్తి చెప్పి సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ రెండు మండలాల్లో టీడీపీకి సంబంధించి  పంచాయతీలకు పంచాయతీలే ఖాళీ అయిపోయాయి. 

కూనదీ అదే పరిస్థితి.. 
అధికారంలో ఉన్నంతసేపూ దౌర్జన్యాలతో, ఓడిపోయాక అనుచిత వైఖరితో వివాదాస్పదమైన కూన రవికుమార్‌కు సైతం ఆ పార్టీ నేతలు ఝలక్‌ ఇచ్చారు. పొందూరు మండలానికి చెందిన తోలాపి గ్రామంలో వందలాదిమంది టీడీపీ నాయకులు, కార్యకర్తల స్పీకర్‌ తమ్మినేని సీతారాం సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో కూన రవికుమార్‌కు కోలుకోలేని దెబ్బ తగిలినట్టయింది.  

వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు 
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడమే అందరి కర్తవ్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. టెక్కలి, సంతబొమ్మాళి మండలాల నుంచి సుమారు వెయ్యి కుటుంబాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పారీ్టలోకి సోమవారం చేరాయి. శ్రీకాకుళం నగరంలో పార్టీ కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు, పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ సమక్షంలో భారీగా చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. వైఎస్‌ జగన్‌ పా లన చూసి పార్టీలోకి చేరేందుకు ముందుకు వస్తున్నారని మంత్రి అన్నారు. పార్టీలో చేరేందుకు వచ్చే వారందరినీ స్వాగతించాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగురవేయడమే లక్ష్యమని తెలిపారు. అనంతరం పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి మా ట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో టెక్కలి, సంత»ొమ్మాళి మండలాల నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి విజయపతాకం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17న తేదిన ఉత్తరాంధ్ర అభివృద్ధిని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో వైఎ స్సార్‌ కూడలి నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నామని అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని ఏర్పా టు చేసి నిరంతరం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని తెలిపారు.  

భారీగా చేరికలు  
సంతబొమ్మాళి మండలం నుంచి 8 గ్రామాల నుంచి సు మారు వెయ్యి కుటుంబాలు చేరాయి. ఇందులో ముఖ్యులు పాలవానిపేట నుంచి పాల వసంతరెడ్డి సమక్షంలో అత్యధికంగా చేరారు. మాజీ సర్పంచ్‌లు పాల మహేష్‌ బైపల్లి ప్రకాస్, చెట్టి అప్పలరాజు, కారాడ పోతయ్య, గొరకల ఆదినారాయణ, అంగూరు మధు, బైపల్లి ప్రకాస్, పిన్నింటి ఎండయ్య, అట్టాడ వెంకటరమణ, అల్లుపల్లి పోతయ్య, దర్మవరపు పూర్ణచారి, లోపింటి రామిరెడ్డి, గెద్దల కేశవరావు, ఎమ్‌.వెంకటరావు (విద్యాకమిటీ చైర్మన్‌), శిర్ల ప్రకాష్‌, చిన్నారెడ్డి, మోస శ్రీరాములు, సిహెచ్‌ చిన్నారెడ్డి, సుగ్గు రమేష్‌రెడ్డి, లింగుడు ప్రసాదరెడ్డి, దుంగ నర్శింహులు, గీత చెంచులతో పాటు టెక్కలి మండలం నుంచి కొప్పుల నగేష్‌బాబు, బొడ్డు సింహాద్రి, బగల శ్రీనివాసరావు, కొప్పుల మాధవరావు, మోద వసంతరావు, ముద్దాడ చలపతిరావు, బగల వినోద్, బద్రి ఉమాశంకర్, పటా్నన కళ్యాణ్, టి.గోవింద, కె.వీరయ్యలు పార్టీలో చేరారు.

తమ్మినేని ఆధ్వర్యంలో భారీగా చేరికలు 
పొందూరు: తోలాపి గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు నిర్వహించిన పౌరసన్మాన సభ ప్రారంభానికి ముందుకు పారీ్టలో చేరికలు జరిగాయి. దుంపల రామారావు (లక్ష్మణరావు) ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి ప్రజలకు సేవ చేద్దామనే సంకల్పంతో అఖిల భారత వెనుకబడిన కులాల ఫెడరేషన్‌ (ఏఐబీసీఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు ఇస్తున్న గౌరవానికి, ప్రాముఖ్యతకు, విధివిధానాలు, ప్రజారంజక పాలనకు ఆకర్షితులై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పారీ్టలోకి చేరానని చెప్పారు. తమ్మినేని చిరంజీవి నాగ్‌ పార్టీ కండువాను కప్పి దుంపల లక్ష్మణరావుతో విశ్రాంత ఆర్‌ఐఓ దుంపల శ్యామలరావు, డాక్టర్‌ పొన్నాడ జోగినాయుడు, కూన తిరుపతిరావు, తుంపల ప్రభాకరరావు, జిల్లా ఎస్‌సీ సెల్‌ అధ్యక్షుడు పి. శ్రీనివాసరావులతోపాటు సుమారు 300 మందిని పారీ్టలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, వైఎస్సార్‌సీపీ నాయకులు సువ్వారి గాం«దీ, పప్పల మున్న, లోలుగు కాంతారావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు గంట్యాడ రమేష్, తోలాపి నాయకులు పప్పల రాధాకృష్ణ, పప్పల రమేష్, పప్పల అన్నాజీ, పప్పల దాలినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top