
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని ప్రజలకు ఏం చేశారని జైపాల్‌రెడ్డి ప్రశ్నించడం కాంగ్రెస్ పార్టీ దివాలాకోరు తనానికి నిదర్శనమన్నారు.
ప్రజలకు బీజేపీ, మోదీ ఏమీ చేయకపోతే 14 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో చెప్పాలన్నారు. పెట్రోల్ ధరలపై జైపాల్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, ఆయన పెట్రోల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ధరలు పెంచారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.