మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కీలక వ్యాఖ్యలు | KTR to be Next CM After KCR, Says Srinivas Goud | Sakshi
Sakshi News home page

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కీలక వ్యాఖ్యలు

Dec 27 2019 12:39 PM | Updated on Dec 27 2019 1:25 PM

KTR to be Next CM After KCR, Says Srinivas Goud - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు తప్పుకున్న తర్వాత టీఆర్‌ఎస్‌ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ తర్వాత ఆయన తనయుడు కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన అన్ని అర్హతలూ కేటీఆర్‌కు ఉన్నాయని, తెలంగాణ ఉద్యమంలోనూ కేటీఆర్‌ క్రియాశీలకంగా పాల్గొన్నారని పేర్కొన్నారు.

గతంలోనూ టీఆర్‌ఎస్‌ నుంచి కేసీఆర్ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. కేటీఆర్‌ను సీఎంను చేసి.. కేసీఆర్‌ కేంద్ర రాజకీయాల్లోకి వెళుతారని ఊహాగానాలూ వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత కేటీఆర్‌కు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేసీఆర్‌ పగ్గాలు అప్పగించారు. దీంతో కేసీఆర్‌ వారసుడిగా కేటీఆర్‌ పార్టీని, భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని నడుపుతారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement