‘వారిద్దరు దేశంలోనే నెంబర్‌ వన్‌ దొంగలు’

Krosuru Venkat Slams Sujana Chowdary Over ED Raids - Sakshi

బీజేపీ అధికార ప్రతినిధి క్రోసూరు వెంకట్‌

సాక్షి, విజయవాడ : టీడీపీ నాయకులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు అని బీజేపీ అధికార ప్రతినిధి క్రోసూరు వెంకట్‌ వ్యాఖ్యానించారు. వీరిద్దరు దేశంలోనే నెంబర్‌ వన్‌ దొంగలు అని ఎద్దేవా చేశారు. మంగళవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన కేసులో సుజనా చౌదరిపై ఈడీ దాడులు చేస్తోంటే సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ నాయకులంతా వణికిపోతున్నారన్నారు. నిజంగా తప్పు చేయకుంటే భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టింది చాలదన్నట్లు ప్రధాని మోదీ కావాలనే దాడులు చేయిస్తున్నారంటూ అసత్య ప్రచారం చేయడం వారికే చెల్లిందంటూ వెంకట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధా వెంకన్న కాల్‌ మనీ వ్యాపారస్తుడని, భూకబ్జాదారుడు అని ఆరోపించారు. అటువంటి వ్యక్తులకు మోదీని విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top