కచ్చితంగా పార్టీ మారతా  | Komatireddy Raj Gopal Reddy Decides To Quit Congress Party | Sakshi
Sakshi News home page

కచ్చితంగా పార్టీ మారతా 

Jun 26 2019 3:01 AM | Updated on Jun 26 2019 3:01 AM

Komatireddy Raj Gopal Reddy Decides To Quit Congress Party - Sakshi

అందుకే ఆ పార్టీకి దగ్గరవుతున్నట్లు ఆయన తెలిపారు.

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మునిగిపోయే కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తు లేదని, తాను కచ్చితంగా ఆ పార్టీని వీడతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం టీఆర్‌ఎస్‌లో విలీనమైన నేపథ్యంలో మిగిలిన సభ్యులను ఎలా పరిగణిస్తారన్న విషయంలో స్పష్టత కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనన్నారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనలాంటి యువత, దేశ యావత్‌ ప్రధాని మోదీ నాయకత్వాన్ని కోరుకుంటోందని, రాష్ట్రంలో కూడా బలమైన శక్తిగా ఎదిగేందుకు ఒక్క బీజేపీకే అవకాశముందని చెప్పారు. అందుకే ఆ పార్టీకి దగ్గరవుతున్నట్లు ఆయన తెలిపారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం బీజేపీకి దగ్గరవుతున్నట్టు చెప్పారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement