తాడిపత్రికి విముక్తి కలిగిస్తాం : కేతిరెడ్డి | Ketireddy Peddareddy Campaign In Thadipatri | Sakshi
Sakshi News home page

తాడిపత్రికి విముక్తి కలిగిస్తాం : కేతిరెడ్డి

Mar 26 2019 8:50 AM | Updated on Mar 26 2019 8:50 AM

Ketireddy Peddareddy Campaign In Thadipatri - Sakshi

బహిరంగ సభలో మాట్లాడుతున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి

సాక్షి, తాడిపత్రి అర్బన్‌:  సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగిరేసి జేసీ సోదరుల కబంధహస్తాల్లో చిక్కుకున్న తాడిపత్రికి విముక్తి కల్గిస్తామని తాడిపత్రి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో రెండవ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడిపత్రిలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ  అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆద్యంతం జేసీ బ్రదర్స్‌పై నిప్పులు చెరిగారు. తాడిపత్రి ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకునే రోజు దగ్గర్లోనే ఉంది. జగనన్న రాజ్యం రావాలంటే మనమందరం కలిసి కట్టుగా పోరాటం చేయాలన్నారు. జేసీ సోదరుల రాక్షస పాలనకు చరమగీతం పాడాలంటే ఓటు అనే ఆయుధంతో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.  

 వైఎస్సార్‌సీపీలోనే బీసీలకు పెద్దపీట  
బడుగు,బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించడంలో వైఎస్‌.జగనన్న ఎప్పుడూ ముందుంటారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలకు బీసీ అభ్యర్థులనే ప్రకటించిన వైఎస్‌.జగన్‌ తన విశ్వసనీయతను చాటుకున్నాడు. పార్లమెంటు ఇద్దరికీ ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేనప్పటికీ ముందుగా మాట ఇచ్చిన విధంగానే రెండు పార్లమెంటు స్థానాలను బీసీలకు ఇచ్చి తన చిత్తశుద్ది నిరూపించుకున్నాడు రాబోయే ఎన్నికల్లో విశ్వసనీయతకు, విలువలకు పట్టం కట్టండి. ఫ్యానుగుర్తుకు ఓటువేసి జేసీ సోదరుల అరాచకపాలనకు చరమగీతం పాడదాం. 
 – తలారి రంగయ్య, అనంతపురం వైఎస్సార్‌సీపీ పార్లమెంటు అభ్యర్థి.

 భయపడాల్సిన అవసరం లేదు 
తాడిపత్రి ప్రజలు మనసాక్షిగా ఓటేయండి ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. టీడీపీ వారు డబ్బు ఇస్తే అది ఒక్కసారి మాత్రమే ఇస్తారు. కాని జగనన్న సీఎం అయితే ప్రతి ఏడాది రూ.20వేలు ఇస్తాడు.  మహిళలు ఒక్కసారి ఆలోచించుకోవాలి.  తాడిపత్రిలో మార్పు అవసరం.వచ్చే ఎన్నికల్లో మార్పు తథ్యం. –ఆలూరి సాంబశివారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు.

జేసీ గుండెల్లో రైళ్లు 
వైఎస్‌.జగన్‌ సభతో జేసీ గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. జేసీ సోదరుల కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.  వైఎస్‌.జగన్‌ సీఎం అయితే తనను జైలులో పెడతారని ఎంపీ జేసీ చేస్తున్న వ్యాఖ్యలు త్వరలోనే నిజమవుతాయి.  ఎంపీ దివాకర్‌రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్ళడం తథ్యం. –పైలా నరసింహయ్య, వైఎస్సార్‌సీపీ రాష్ట్రకార్యదర్శి 

జగనన్నను సీఎం చేసుకుందాం 
వైఎస్‌.జగనన్నను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముస్లిం సోదరులు ఒక సారి ఆలోచించాలి. మహానేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఉండకపోతే ఈరోజు పేద ముస్లింల పరిస్థితి ఎంతో దారుణంగా ఉండేదని ఆ మహానేత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఎంతో మంది పేద ముస్లిం మైనార్టీల కుటుంబాల్లో వెలుగులు నిండాయి.  నవరత్నాల పథకాలతో మన భవిష్యత్తు మారబోతోంది. వైఎస్‌.జగన్‌ సీఎం కావడం తథ్యం. –గయాజ్‌బాషా, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు 

మంచి పాలన వైఎస్‌. జగన్‌తోనే సాధ్యం 
ప్రజలకు మంచి పాలన అందించాలంటే అది ఒక్క వైఎస్‌.జగన్‌తోనే సాధ్యం.  రైతుల కష్టసుఖాలను తెలుసుకుని రైతాంగానికి పెద్దపీట వేసిన మహానేత వైఎస్సార్‌ను రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని, విలువలను,విశ్వసనీయను పుణికిపుచ్చుకున్న యువనేత వైఎస్‌.జగనన్న నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం.మంచి నాయకుడు ఉండే రాష్ట్రం అభివృద్ది చెందుతుంది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని గెలిపించి జగనన్నకు కానుకగా ఇవ్వాలి.  - పేరం స్వర్ణలత, వైఎస్సార్‌సీపీ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి 

తాడిపత్రిని చెడగొట్టకండి 
తాడిపత్రిలో గ్రానైట్‌రంగం జేసీసోదరుల నిర్వాకం వల్ల మూతపడిపోతోంది.  2014 ఎన్నికల్లో గ్రానైట్‌ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జేసీ పీఆర్‌ గ్రానైట్‌ పరిశ్రమలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విజిలెన్స్‌ దాడులు ఏవీ ఉండవని హామీ ఇచ్చి, వారి ఓట్లతో లబ్దిపొంది నేడు వారిపై కక్షసాధింపుచర్యలకు పూనుకున్నాడు.  జేసీ సోదరులారా ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది.- జగదీశ్వర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు 
    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement