కేంద్రంతో టీడీపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ | kesavarao commented over tdp | Sakshi
Sakshi News home page

కేంద్రంతో టీడీపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌

Feb 10 2018 1:31 AM | Updated on Aug 10 2018 8:46 PM

kesavarao commented over tdp - Sakshi

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర డిమాండ్లు సాధించుకోవడం కోసం టీడీపీ కేంద్రం లో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కె కేశవరావు (కేకే) ఆరోపించారు. శుక్రవారం రాజ్యసభలో బడ్జె ట్‌పై చర్చలో పాల్గొన్న కేకే మాట్లాడుతూ డిమాండ్ల సాధనకు టీడీపీ ఆందోళన చేస్తున్న తీరును తప్పుపట్టారు. ఆర్థిక మంత్రితో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన టీడీపీకి సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌ విభజన అశాస్త్రీయంగా జరిగిందన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని.. తద్వారా ఆయన పార్లమెంటునే తప్పుపట్టినట్లయిందన్నారు. గత నాలుగేళ్లలో కేంద్రం ఏపీకి రూ.13 వేల కోట్లు కేటాయించగా.. తెలంగాణకు కేవలం రూ. రెండు వేల కోట్లే విదిల్చిందన్నారు. ఏపీకి అధికంగా నిధులిచ్చినా తాము పట్టించుకోమని కేకే అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement