
తూర్పుగోదావరి ,మధురపూడి (రాజా నగరం): సమాజోద్ధరణలో భాగంగా మాదిగలకు రాజ్యాధికారం ఇవ్వాలని ఫిల్మ్ క్రిటిక్, పొలిటికల్ కామెంటేటర్ కత్తి మహేష్ అన్నా రు. గురువారం మధ్యాహ్నం స్పైస్‌జెట్ విమానంలో వచ్చిన ఆయన జిల్లాలో పర్యటించిన అనంతరం రాత్రి అదే విమానంలో హైదరాబాద్ వెళ్లారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని 25 లక్షల మంది మాదిగల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.
రాష్ట్ర పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చి, నాయకులతో చర్చించానని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షణకు దళితులు సన్నద్ధం కావాలన్నారు. ఆయనకు ఎయిర్‌పోర్టులో దళిత నాయకుడు పెందుర్తి సునీల్ స్వాగతం పలికారు.