కర్ణాటక: బీజేపీ సంచలన ఆరోపణలు

Karnataka BJP Accuses Congress For Mobile Phone Tapping - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తల నడుమ.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం బీజేపీలో కలకలం రేపుతున్నది.

మా ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారు: జేడీఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100కోట్లు ఆఫర్‌ చేస్తున్నదన్న కుమారస్వామి ఆరోపణలను కొట్టిపారేసిన కాషాయదళం... ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాన్ని తెరపైకి తెచ్చింది. కర్ణాటక ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌లకు పాల్పడుతున్నదని, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే టార్గెట్‌గా వ్యవహారం నడుస్తున్నదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు బుధవారం ఫిర్యాదులు వెళ్లాయి. బీజేపీ ఎంపీలు శోభా కరంద్లాజే, జీఎం సిద్ధేశ్వర, పీసీ మోహన్‌లు ఉమ్మడిగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాశారు. ‘‘కర్ణాటకలో అధికార దుర్వినియోగానికి సంబంధించి మా వద్ద స్పష్టమైన కారణాలున్నాయి. చట్టవిరుద్ధంగా మా ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే జోక్యం చేసుకోండి..’ అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం సిద్దరామయ్య ఆపద్ధర్మముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ స్పందించాల్సిఉంది.
కేంద్రానికి బీజేపీ ఎంపీ శోభ రాసిన లేఖ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top