చంద్రబాబుకు ఎందుకంత ఉలిక్కిపాటు?

Kannababu Lashes Out At Chandrababu Naidu Over Amaravati - Sakshi

సాక్షి, కాకినాడ : ప్రజల అభీష్టం, ఆకాంక్షలు మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పని చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.  రాష్ట్ర విభజన తర్వాత అధికార, పాలనా వికేంద్రీకరణ అవసరమని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజల కోరిక మేరకే సీఎం జగన్‌ పరిపాలిస్తున్నారని, అధికార వికేంద్రీకరణ చేస్తే చంద్రబాబు అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. (లోకేష్ ఓడిపోయాక రెఫరెండం ఎందుకు..?’)

మంత్రి కన్నబాబు బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రచారాన్ని భుజాలపై మోసే సొంత ప్రచార సాధనాలను పెట్టుకుని ఒక అబద్ధాన్ని నిజం చేసేలా ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని విషయంలో ఒక కృత్రిమ పోరాటాన్ని తయారు చేశారని కన్నబాబు మండిపడ్డారు. మొన్నటివరకూ అక్కడ వీధుల్లో తిరిగి జోలె పట్టుకుని చంద్రబాబు చందాలు వసూలు చేశారని, ఆయన క్యారెక్టర్‌కు ఇది ఒక నిదర్శనమని వ్యాఖ్యానించారు. జోలె పట్టుకుని సేకరించిన బంగారం, డబ్బులు ఎంత వచ్చాయో చెబితే చంద్రబాబు నిజాయితీ ఏంటో తెలుస్తుందన్నారు.  (రాజధానితో చంద్రబాబు వ్యాపారం)

రాజధానిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత చంద్రబాబు భంగపడ్డారని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు విజన్‌ విశాఖలో బికినీ ప్రదర్శన చేయాలని... వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది సీఎం జగన్‌ విజన్‌’ అని అన్నారు. మంత్రులు నారావారిపల్లె కాదు.. ఏ ప్రాంతానికి అయినా వెళతారు. సొంత గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేని వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు నారివారి పల్లెపై లేని ప్రేమ అమరావతిపై ఎందుకు పుట్టిందని సూటిగా ప్రశ్నించారు. (కొందరు భ్రమలు కల్పిస్తున్నారు: జీవీఎల్)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top