‘టీడీపీ నేతలు దళితుల భూములను లాక్కున్నారు’

Kaile Anil Kumar Speech About TDP Insider Trading In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: దళితుల భూములను మభ్యపెట్టి, భయపెట్టి మరీ టీడీపీ నేతలు లాక్కున్నారని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ దొంగల ముసుగులు తొలగుతున్నాయని తెలిపారు. టీడిపీకి చెందిన నేతలు నారాయణ, పత్తిపాటి పుల్లారావులపై సీఐడీ నమోదు చేసిన కేసులే అందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.  తాజాగా దళిత మహిళ  బుజ్జమ్మ ఫిర్యాదుతో మాజీ మంత్రుల భూ భాగోతం బయపడిందని ఆయన మండిపడ్డారు. బుజ్జమ్మ లాంటి బాధిత దళితులు రాజధాని ప్రాంతంలో చాలామంది ఉన్నారని అనిల్‌ కుమార్‌ తెలిపారు.
చదవండి: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌: పత్తిపాటి, నారాయణపై కేసులు

సీఐడీ పూర్తి స్థాయిలో విచారణ చేసి..  ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కలుగులో ఉన్న టీడీపీ నేతల బండారాన్నీ బయటపెట్టాలి పేర్కొన్నారు. పేదల పేరుతో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. బినామీల పేర్లతో కొనుగోలు చేసిన భూములను కాపాడుకునేందు పరిపాలన వికేంద్రీకరణను టీడీపీ అడ్డుకుంటుందని అనిల్‌ కుమార్‌ మండిపడ్డారు. టీడీపీ నేతలు మండలి చైర్మన్‌పై ఒత్తిడి చేసి అప్రజాస్వామిక నిర్ణయం తీసుకొనేలా చేశారని అనిల్‌ కుమార్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. చదవండి: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top