జార్ఖండ్‌ మూడో దశలో 62 శాతం పోలింగ్‌ | jharkhand fourth phase election polling peaceful | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌ మూడో దశలో 62 శాతం పోలింగ్‌

Dec 13 2019 5:48 AM | Updated on Dec 13 2019 5:48 AM

jharkhand fourth phase election polling peaceful - Sakshi

రాంచి: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఎనిమిది జిల్లాల్లో 17 సీట్లకు జరుగుతోన్న ఈ ఎన్నికల్లో 56 లక్షల మంది (62.6 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జార్ఖండ్‌ ప్రధాన ఎన్నికల అధికారి వినయ్‌ కుమార్‌ చౌబే వెల్లడించారు. వీరిలో 26 లక్షల మంది మహిళలు, 86 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని తెలిపారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. రాంచి, హటియా, కాంకే, బర్ఖాతా, రామ్‌గర్‌లలో సాయంత్రం 5 గంటల వరకు.. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement