వ్యవసాయ యంత్రాల పథకంలో అక్రమాలు | Inaccuracies in agricultural machinery scheme | Sakshi
Sakshi News home page

వ్యవసాయ యంత్రాల పథకంలో అక్రమాలు

Nov 3 2017 2:01 AM | Updated on Nov 3 2017 2:01 AM

Inaccuracies in agricultural machinery scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ యంత్రాల పథకంలో అక్రమాలు జరిగాయని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. అర్హులను పక్కనపెట్టి వ్యవసాయం కూడా తెలియని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ట్రాక్టర్లు ఇచ్చారన్నారు.

పార్టీలకతీతంగా అమలు చేయాల్సిన పథకాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫారసులకు అనుగుణంగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. దీనికి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన సిఫారసులను తీసుకొని జిల్లాలకు పంపించామని, అక్కడి అధికారులు వారిలో అర్హులు ఉంటే గుర్తించి ట్రాక్టర్లు ఇచ్చారన్నారు. గురువారం మండలిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు షబ్బీర్‌ అలీ, ఆకుల లలిత, సుధాకర్‌రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement