పోలింగ్‌ హింసాత్మకం : నారాయణ్‌పూర్‌లో భారీ పేలుడు

IED Blast In Chhattisgarhs Narayanpur - Sakshi

రాయ్‌పూర్‌ : లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగలో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చత్తీస్‌గఢ్‌లో పోలింగ్‌ బహిష్కరణకు పిలుపు ఇచ్చిన మావోయిస్టులు హింసతో చెలరేగారు. నారాయణపూర్‌లో భారీ ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకున్నా పోలింగ్‌ నేపథ్యంలో భయాందోళనలు నెలకొన్నాయి.

నారాయణపూర్‌ ఫరాస్‌గాం ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ఘటనలో ఎవరూ గాయపడలేదని ఎస్పీ చెప్పారు. మరోవైపు బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భారీ భద్రత నడుమ పోలింగ్‌ జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే సహా నలుగురు వ్యక్తులు మంగళవారం మావోల చేతిలో హత్యకు గురైన దంతెవాడ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఈ నియోజకవర్గ పరిధిలో ఉండటంతో 80,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top