
కోడెలతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్న రవిచంద్రకుమార్ (వృత్తంలో ఉన్న వ్యక్తి)
సాక్షి, గుంటూరు: సత్తెనపల్లిలో పైలేరియా విభాగంలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మాచేటి రవిచంద్రకుమార్ ఓ ప్రభుత్వ ఉద్యోగి.. అయినప్పటికీ పచ్చకండువా వేసుకుని ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నాడు. టీడీపీ ప్రచార కార్యక్రమాలతోపాటు, గతంలో నిరసన కార్యక్రమాల్లోనూ ఆయన హల్‌చల్ చేశారు. ఎన్నికల కోడ్ తనకు వర్తించదన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది. స్పీకర్ కోడెల వెంట ప్రచారంలో పాల్గొంటూ ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాడు.అతను బుధవారం కూడా కోడెల వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఎన్నికల కోడ్ తనకు వర్తించదని.. అధికారులు తన జోలికి రాలేరనే స్థాయిలో ఆయన వ్యవహార శైలి ఉంది.