
న్యూఢిల్లీ/రాజ్‌కోట్: ఓ ఐసిస్ ఉగ్రవాది ఇన్నాళ్లూ గుజరాత్‌లో పనిచేసిన వైద్యశాలకు, ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ అగ్రనేత అహ్మద్ పటేల్‌కు సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. ఐసిస్ ఉగ్రవాదులుగా అనుమానిస్తూ గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం ఇద్దరిని అరెస్టు చేసింది.
వారిలో కసీం స్టింబర్‌వాలా అనే వ్యక్తి భహ్రూచ్ జిల్లా అంకాలేశ్వర్‌లోని సర్దార్ పటేల్ వైద్యశాలలో పనిచేసేవాడు. అరెస్టవ్వడానికి ముందే రాజీనామా చేశాడు. ఈ ఆసుపత్రికి 2015 వరకు పటేల్ ధర్మకర్తగా ఉన్నారు. పటేల్‌పై ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. 2015 వరకు వైద్యశాలకు పటేల్ ధర్మకర్తగా ఉంటే, అరెస్టైన వ్యక్తి ఏడాది క్రితమే ఉద్యోగంలో చేరాడనీ, పటేల్‌పై ఆరోపణలు చేసి బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు.