 
													సాక్షి, అనపర్తి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి కన్నుమూశారు. 1989, 2004లో అనపర్తి ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రామారెడ్డి కుటుంబసభ్యులకు సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
