కిడ్నీ రోగులకు త్వరలో పింఛన్‌: ఈటల

Etela Rajender Says New Pension Scheme For Kidney Patients - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్‌ ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. త్వరలోనే వీరికి పింఛన్‌ మంజూరుపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిపారు. డయాలసిస్‌ కేంద్రాల్లో కిడ్నీ రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సభ్యులు బిగాల గణేశ్, వివేకానంద్, కంచర్ల భూపాల్‌రెడ్డి, సంజయ్‌కుమార్, అబ్రహం, గొంగిడి సునీత అడిగిన ప్రశ్నలకు ఈటల బదులిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 43 డయాలసిస్‌ కేంద్రాల్లో 270 మెషీన్లను ఏర్పాటు చేశామని, సగటున నలుగురు పేషెంట్లకు చికిత్సందిస్తున్నట్లు తెలిపారు. ఏటా ఒక్కో రోగిపై ప్రభుత్వం రూ.1.20 లక్షలను ఖర్చుచేస్తోందని, మరిన్ని సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top