
సాక్షి, న్యూఢిల్లీ : తొలి విడత నుంచి చివరి విడత వరకు ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఎగ్జిట్ పోల్స్ ప్రచురణ, ప్రసారాలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధించింది. ఈ మేరకు సోమవారం ప్రకటన జారీచేసింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11 ఉదయం 7 గంటల నుంచి మే 19వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించింది. అలాగే ఒపినీయన్ పోల్స్ ఫలితాలు, సర్వేలు సహా ఎలాంటి ఎన్నికల అంశాలను ఎన్నిక ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయరాదని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.