బీజేపీ ఎమ్మెల్యేపై రూ. 204 కోట్ల దావా 

DK Shivakumar Files Defamation Case On BJP MLA - Sakshi

బెంగళూరు: తనపై నిరాధార వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ సీనియర్‌నేత డీకే శివకుమార్, బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌పై రూ. 204 కోట్ల పరువునష్టం దావా వేశారు. శివకుమార్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘జూన్‌ 23న పాటిల్‌ నాపై నిరాధార వ్యాఖ్యలు చేశారు. కేసులు నమోదు చేయవద్దంటూ నేను బీజేపీ నాయకులను, కేంద్ర మంత్రులపై ఒత్తిడి తెచ్చినట్లు మీడియాతో అన్నారు. ఒకవేళ నాపై కేసులు నమోదుచేయకపోతే సంకీర్ణ కూటమి పతనంలో నేను తటస్థ వైఖరి అనుసరిస్తాను అన్నట్లు చెప్పారు. వీటి వల్ల కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టిలో నా విధేయత, చిత్తశుద్ధి దెబ్బతిన్నాయి. నా ప్రతిష్ట మంటగలిచింది’ అని చెప్పారు. రామానగర్‌ జ్యుడీషి యల్‌ మెజిస్ట్రేట్‌  కోర్టులో సెప్టెంబర్‌ 18న ఈ కేసు విచారణకు రానుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top