నేడు హైదరాబాద్‌ రానున్న దేవెగౌడ | Deve Gowda To Visit Hyderabad Today | Sakshi
Sakshi News home page

నేడు హైదరాబాద్‌ రానున్న దేవెగౌడ

Jun 30 2018 5:18 PM | Updated on Sep 4 2018 5:44 PM

Deve Gowda To Visit Hyderabad Today - Sakshi

మాజీ ప్రధాని దేవెగౌడ (పాత ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు మంత్రి తలసాని శ్రీనివాస్ ‌యాదవ్‌, అధికారులు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భనవ్‌కు వెళ్లి దేవెగౌడ సీఎం కేసీఆర్‌తో సమావేశం అవుతారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు, జాతీయ రాజకీయాలు తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటే ఎజెండాగా ఇటీవల సీఎం కేసీఆర్‌ బెంగళూరుకు వెళ్లి దేవెగౌడతో సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. అంతకుముందు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ కేసీఆర్‌ భేటీ అయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement