‘ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణం’

CPI Leader Ramakrishna Allegations Election Commission And Ap Government - Sakshi

సాక్షి, విజయవాడ : పోలవరం, అమరావతి యాత్ర, నవ నిర్మాణ దీక్షల పేరుతో ఆర్టీసి బస్సులను వినియోగించుకున్న ప్రభుత్వం.. ఆ సంస్థను నష్టాల్లోకి నెట్టిందని సీపీఐ రాష్ట్ర  కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆయన ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులను వాడుకుని 750కోట్ల బకాయిలు చెల్లించలేదని తెలిపారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణమని అన్నారు. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు నిర్లక్ష్యమే కార్మికుల సమ్మెకు కారణమని పేర్కొన్నారు.

ఎన్నికల నేపథ్యంలో కార్పోరేట్‌ కంపెనీలు వేలకోట్లు కట్టబెట్టాయని విమర్శించారు. బీజేపీకి కార్పోరేట్‌ బాండ్ల ద్వారా 2256 కోట్లు​జమ చేశారని ఆరోపించారు. కార్పోరేట్‌ కంపెనీ నిధులు ఇచ్చినా.. వారి పేర్లు వెల్లడించాలని కోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీపై ఎన్నికల కమిషన్‌ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఎన్నికల్లో జేసీ దివాకర్‌రెడ్డి 50కోట్లు ఖర్చుపెట్టామని చెప్పినా చర్యల్లేవని మండిపడ్డారు. డబ్బులు పంచిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డబ్బు పంపిణీపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top