దివ్య స్పందన స్థానంలో రోహన్‌ గుప్తా

Congress Replaces Divya Spandana With Rohan Gupta For IT - Sakshi

కాంగ్రెస్‌ ఐటీ చీఫ్‌గా రోహన్‌ గుప్తా

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా బాధ్యతలను కొత్త వ్యక్తికి అప్పగించింది. గుజరాత్‌కు చెందిన రోహన్‌ గుప్తాను సోషల్‌ మీడియా విభాగానికి చీఫ్‌గా నియమించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. కాగా  మొన్నటి వరకు సోషల్‌ మీడియా వింగ్‌ను నడిపిని ఆ పార్టీ మాజీ ఎంపీ దివ్య స్పందన ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసింది. ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో నాలుగు నెలల అనంతరం ఆమె స్థానంలో కొత్త వ్యక్తిని నియమించారు. రోహన్ గుప్తా 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చీఫ్‌గా పనిచేశారు. ఏఐసీసీ జాతీయ మీడియా సమన్వయకర్తగా ఉన్న కాంగ్రెస్ నేత రాజ్‌కుమార్ గుప్తా కుమారుడే రోహన్ గుప్తా.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top