
తనతో పాటు మరికొందరిని బీజేపీలోకి తీసుకెళ్లాలని రాజగోపాల్‌రెడ్డి ఆలోచిస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. పార్టీ ప్రతిపక్ష హోదాను పోగొట్టుకున్న గడ్డు పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం లాంఛనమేననే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరగుతోంది.
(చదవండి : టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం)
తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా బీజేపీలోకి జంప్ అయ్యేలా కనిపిస్తోంది. ఆదివారం జగ్గారెడ్డికి రాజగోపాల్‌రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర ఆరోపణనలు చేసిన మరుసటి రోజే జగ్గారెడ్డితో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనతోపాటు జగ్గారెడ్డిని కూడా బీజేపీలోకి తీసుకెళ్లడానికి రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఇంకెంత మంది బీజేపీలోకి చేరుతారు? అసలు రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎవరు మిలుగుతారన్నది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.