కాంగ్రెస్‌ కబంధ హస్తాల్లో కోదండరాం: సుమన్‌

congress leaders slams trs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ కబంధ హస్తాల్లో జేఏసీ చైర్మన్‌ కోదండరాం బందీ అయ్యారని ఎంపీ బాల్క సుమన్‌ విమర్శించారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక లేని కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక పోతున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో  మాట్లాడుతూ.. కాళేశ్వరం, మల్లన్న సాగర్, పాలమూరు, డిండి, కొండపోచమ్మ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసులు వేసిన ముఠానే నిరుద్యోగుల సమస్యను వాడుకుంటూ విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీస్తోందని మండిపడ్డారు.

రాజకీయం చేస్తున్న కోదండరాం ముఠా: పల్లా
సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణకు వస్తున్న ఖ్యాతిని తట్టుకోలేక విపక్షాలు కోదండరాంను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం, కేసీఆర్, ఆయన కుటుంబంపై విషం కక్కుతున్నాయని మండలిలో ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కోదండరాంను, ఆయన ముఠాను నిరుద్యోగులు నమ్మడం లేదన్నారు. కోదండరాంకు దమ్ముంటే పార్టీ పెట్టాలన్నారు. విద్యార్థి మురళి డీఈడీ, బీఈడీ చేయలేదని తెలిసి కూడా ఆయన డీఎస్సీ కోసం సిద్ధమవుతున్నారని కోదండరాం అసత్యాలు చెప్పడం దురదృష్టకరమన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top