నామినేషన్‌కు నాణేలు | Coins for election nomination | Sakshi
Sakshi News home page

నామినేషన్‌కు నాణేలు

Nov 13 2018 3:26 AM | Updated on Nov 13 2018 3:26 AM

Coins for election nomination - Sakshi

డిపాజిట్‌ కోసం తెచ్చిన నాణేలను చూపిస్తున్న రాములు

ఆదిలాబాద్‌ అర్బన్‌: ఆదిలాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా సోమవారం నామినేషన్‌ దాఖలు చేసిన తొగరి రాములు డిపాజిట్‌ కోసం రూపాయి నాణేలు తీసుకొచ్చారు. ఒక్కో ప్లాస్టిక్‌ కవర్‌లో రూ.2,500 చొప్పున రెండు కవర్లకు బ్యాంకు సీల్‌ వేయించి నామినేషన్‌ కేంద్రానికి తీసుకొచ్చారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంటున్న ప్రజలు, సన్నిహితులు ఒక్కో రూపాయి చొప్పున పది వేల మంది రూ.10 వేల నాణేలు ఇచ్చారని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రాములు తెలిపారు. రూ.5 వేల నాణేలను నామినేషన్‌ డిపాజిట్‌ కింద రిటర్నింగ్‌ అధికారులకు అందజేశారు. డిపాజిట్‌ కోసం నాణేలను తీసుకురావడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

Advertisement
 
Advertisement
Advertisement