బీజేపీలో చేరిన ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ | Celebrity Hair Stylist Jawed Habib Joins BJP | Sakshi
Sakshi News home page

ఈరోజు నుంచి చౌకీదారుని : జావేద్‌ హబీబ్‌

Apr 22 2019 7:55 PM | Updated on Apr 22 2019 8:00 PM

Celebrity Hair Stylist Jawed Habib Joins BJP - Sakshi


బీజేపీలో చేరిన ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ జావేద్‌ హబీబ్‌

న్యూఢిల్లీ : ప్రముఖ, సెలబ్రిటీ హెయిర్‌ స్టైలిస్ట్‌ జావేద్‌ హబీబ్‌ బీజేపీలో చేరారు. సోమవారం ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో కషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ‘ ఇప్పటిదాకా నేను కేశాలకు(సంరక్షణ) చౌకీదారును. ఈరోజు నుంచి దేశానికి కాపలాదారుగా మారాను’ అంటూ చమత్కరించారు. ఇక దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లోని 110 పట్టణాలలో సెలూన్లు కలిగి ఉన్న జావేద్‌ హబీబ్‌.. దేశంలోనే అత్యంత ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందారు. సుమారు 846 అవుట్‌లెట్లు కలిగి ఉన్న హబీబ్‌ బ్రాండుకు దాదాపు 15 లక్షలకు పైగా కస్టమర్లు ఉన్నారు.

కాగా దేశవ్యాప్తంగా మంగళవారం మూడో విడత ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. మొత్తం 14 రాష్ట్రాల్లోని 115 లోక్‌సభ స్థానాలకు రేపు పోలింగ్‌ జరుగనుంది. ఇక 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏడు దశల్లో పోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. పలు దఫాలుగా జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మే 23న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల్లోకి చేరికలు, జంపింగ్‌లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అత్యంత జనాదరణ కలిగిన సెలబ్రిటీల చేరికలే లక్ష్యంగా పార్టీ అధినాయకత్వాలు పావులు కదుపుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement