మోదీపై కామెంట్స్‌.. ప్రకాశ్‌ రాజ్‌కు కేసు సెగ! | Case filed against Prakash Raj | Sakshi
Sakshi News home page

మోదీపై ఘాటు కామెంట్స్‌.. ప్రకాశ్‌ రాజ్‌కు కేసు సెగ!

Oct 4 2017 6:37 PM | Updated on Aug 15 2018 6:34 PM

Case filed against Prakash Raj  - Sakshi

లక్నో: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌పై లక్నో కోర్టులో కేసు నమోదైంది. సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ హత్యపై ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని తప్పుబడుతూ ప్రకాశ్‌ రాజ్‌ తాజాగా వ్యంగ్యాస్త్రాలను సంధించిన సంగతి తెలిసిందే. ప్రకాశ్‌ రాజ్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఒక లాయర్‌ లక్నో కోర్టులో కేసు నమోదు చేశారు. అక్టోబర్‌ 7న ఈ కేసు విచారణకు రానుంది.

బెంగళూరులో జరిగిన డెమొక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీవైఎఫ్‌ఐ) సదస్సులో ప్రకాశ్‌ రాజ్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తన కన్నా పెద్ద నటులు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గౌరీ లంకేశ్‌ హత్య ఘటనపై మోదీ మౌనాన్ని నిరసిస్తూ తన జాతీయ అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అనంతరం ప్రకాశ్‌ రాజ్‌ ట్విట్టర్‌లో వివరణ ఇస్తూ.. జాతీయ అవార్డులన తిరిగి ఇవ్వడానికి తానేమైనా పిచ్చోడినా అని ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement