తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి : ఎంపీ అరవింద్‌

BJP MP Dharmapuri Sanjay Comments On KCR - Sakshi

సాక్షి, కామారెడ్డి : రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెడుతుందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ వెల్లడించారు. నిన్న(శనివారం) జరిగిన అమిత్ షా పర్యటనలో ఇందుకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సరిగా అమలు చేయటం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం.. కమీషన్ల కోసమే ఆరాటపడుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పసుపు రైతుల ఇబ్బందులు తీర్చే రోజు దగ్గరకు వచ్చిందని, ఆ సమస్య తీర్చిన రోజు టీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ నెత్తిన తడిగుడ్డ వేసుకుని కూర్చోవాలంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ బాధ్యతను టీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తు చేసే రోజు జీవితంలో రాదని తేల్చిచెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top