బీజేపీని హెచ్చరించిన శివసేన! 

BJP May lose Around 100 seats In Lok Sabha Polls, says Shiv Sena - Sakshi

వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీట్లు 100-110 తగ్గుతాయి

ఉప ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనం

ఎన్డీఏ పాలన, ఓటర్ల విముఖతపై శివసేన విసుర్లు

ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్థానాలు వందకు పైగా తగ్గిపోతాయని శివసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల యూపీ, బిహార్ ఉప ఎన్నికల ఫలితాలతో పోల్చి వచ్చే లోక్‌సభ ఎన్నికల పరిణామాలపై శివసేన పత్రిక సామ్నా ఓ కథనాన్ని ప్రచురించింది. బీజేపీ నేతలకు ఈ కథనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 100 నుంచి 110 స్థానాలు కోల్పోనుందన్నది శివసేన అభిప్రాయం.

త్రిపురలో కమ్యూనిస్ట్ కంచుకోటను బద్దలుకొట్టిన తర్వాత బీజేపీ ప్రాబల్యం దేశంలో మరింత పెరిగిపోయిందని ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కానీ యూపీలో సీఎం, డిప్యూటీ సీఎంల రాజీనామాలతో ఖాళీ అయిన గోరఖ్‌పూర్‌, ఫూల్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి బీజేపీకి షాకివ్వడం శివసేనకు హాట్ టాపిక్‌గా. 2014లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 23 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం 4 సీట్లు మాత్రమే బీజేపీ నెగ్గి, 19 స్థానాల్లో ఓటమి చవిచూసింది. 

త్రిపురలో విజయం అనంతరం దేశ వ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తుందని, ప్రజలు ఎన్డీఏ పాలనకు పట్టం కట్టారని చెప్పి ఆ పార్టీ నేతలు.. కీలకమైన యూపీ రెండు లోక్‌సభ స్థానాల్లో ఓటమి తర్వాత ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. కానీ బీజేపీ మాత్రం ఓట్ల శాతం తగ్గడం, ఎస్పీ-బీఎస్పీలు కలిసి బరిలోకి దిగడం కొంప ముంచిందంటూ వేరే సాకులు చెబుతున్నారని సంపాదకీయం ద్వారా శివసేన తమ అభిప్రాయాన్ని, 2019 లోక్‌సభ ఎన్నికలపై జోస్యం చెప్పింది. 

అత్యధిక లోక్‌సభ స్థానాలుండే యూపీ, బిహార్‌ లాంటి రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు తగ్గితే బీజేపీ సీట్లు కూడా తగ్గుతాయని హెచ్చరించింది. బిహార్‌లో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ జైలుకు వెళ్లిన నేపథ్యాన్ని ఉపయోగించుకుని నితీశ్, బీజేపీలు ఓటర్లను ఆకర్షించుకోలేక పోడం ఎన్డీఏ పాలనకు ఆ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించవచ్చునని శివసేన నేతలు చెబుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top