బీజేపీకి ఆయన గుడ్‌బై చెప్పేశారు! | BJP leader Suraj Pal Amu resigns | Sakshi
Sakshi News home page

Nov 29 2017 1:14 PM | Updated on Nov 29 2017 1:15 PM

BJP leader Suraj Pal Amu resigns  - Sakshi

చండీగఢ్‌: ‘పద్మావతి’ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హరియాణ బీజేపీ నేత సూరజ్‌పాల్‌ అమూ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ హరియాణా మీడియా చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

‘పద్మావతి’ సినిమా వివాదం నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, టైటిల్‌ రోల్‌ పోషించిన దీపికా పదుకోన్‌ తలలు నరికితే రూ. పదికోట్లు ఇస్తానని సూరజ్‌పాల్‌ వివాదాస్పద ఆఫర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధినాయకత్వం కన్నెర్ర జేసింది. షోకాజ్‌ నోటీసు జారీచేసి వివరణ కోరింది. బీజేపీ అధినాయకత్వం, హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తీరుతో అసంతృప్తితోనే ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పినట్టు తెలుస్తోంది. సీఎం ఖట్టర్‌లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదని, కార్యకర్తలకు ఖట్టర్‌ కనీసం గౌరవం ఇవ్వడం లేదని సూరజ్‌పాల్‌ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement