‘ఇంకో మూడు నెలల్లో టీడీపీ శాశ్వతంగా మూతే’ | BJP Leader Manikyala Rao Comments On TDP | Sakshi
Sakshi News home page

‘ఇంకో మూడు నెలల్లో టీడీపీ శాశ్వతంగా మూతే’

Aug 30 2019 11:59 AM | Updated on Aug 30 2019 1:42 PM

BJP Leader Manikyala Rao Comments On TDP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేత మాణిక్యాలరావు విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి నూకలు దగ్గర పడ్డాయని, మరో మూడు నెలల్లో ఆ పార్టీ శాశ్వతంగా మూతపడుతుందని జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలనలో ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేదని అన్నారు. రాజధాని మార్పు విషయంలో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొందని, వైఎస్సాఆర్‌సీపీ ప్రభుత్వం ఇప్పటికైనా రాజధాని మార్పుపై స్పష్టత నివ్వాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement