‘కేంద్రం నిధులతో చంద్రబాబు అవినీతి’

BJP Leader Kanna Lakshmi Narayana Slam To CM Chandrababu - Sakshi

సాక్షి, గుంటూరు : సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. బీజేపీ కార్యకర్తల సమావేశం శుక్రవారం గుంటూరులో జరిగింది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రులు కామినేని, మాణిక్యాలరావు, గోకరాజు గంగరాజు, పురందేశ్వరి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఏపీలో కుక్కను మేక అని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు, ఆయన భజన మీడియా చేస్తోందన్నారు.

రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్న అది కేంద్రం సహకారంతోనే అని కన్నా అన్నారు. ‘అంతేకాక దేశంలో ఉన్న అన్ని ఎయిమ్స్‌లలో  ఏపీకే అత్యధిక నిధులు కేటాయించారు. ఏపీకి అన్ని రంగాల్లో సింహాభాగం నిధులు కేటాయించారు. నాలుగేళ్ళుగా చంద్రబాబు కేంద్రం నిధులు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు. చంద్రబాబు చేసే అవినీతిని ప్రజలందరికి తెలియజేయాలి. బాబు తాను బురద పూసుకుంటూ.. దానిని మనకి పూయాలని చూస్తున్నాడు. అంతేకాక ఏపీలో బాబు మోసం చేయని కులం అంటూ ఉందా? వెనక్కి తిరిగి చూసుకుంటే బాబుదంతా అవినీతి చరిత్ర. త్వరలో ఇంటింటికి బీజేపీలో భాగంగా బాబు అవినీతిని ప్రజలందరికి వివరించాలని’ కన్నా లక్ష్మీనారాయణ సమావేశంలో పేర్కొన్నారు.

మోదీ చరిష్మా ప్రపంచ వ్యాప్తంగా..
సమావేశంలో కేంద్రమంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రంగాలలో సమూలమైన మార్పులు తెచ్చారు. ‘దేశంలో అభివృద్ధి జరుగుతుందని ప్రతిపక్షం కూడా చెప్పక తప్పలేదు.
ప్రధాని మోదీ వచ్చాక అవినీతి, లంచాలు కనుమరుగై పోయాయి. గత పాలనలో అవినీతి, లంచగొండితనం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. ప్రధాని చరిష్మా ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది. మోదీ పని తీరుపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. రైతులకు ఆదాయం పెంచడం కోసం వ్యవసాయంలో అనేక మార్పులు తెచ్చారు. మోదీ పాలనలో దేశం త్వరితగతిన ఎదుగుతుంది. మొదటి క్యాబినెట్‌లో పోలవరంకు నిధులు కేటాయించాం. ఏపీ అభివృద్ధిలో మా చిత్తశుద్దికి అదో నిదర్శనం’    కేంద్ర మంత్రి జేపి నడ్డా తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top