ఆర్‌ కృష్ణయ్య బీజేపీలోకి వస్తే.. | BJP Chief Amit Shah Will Visit Telangana In October Says K Laxman | Sakshi
Sakshi News home page

Sep 26 2018 7:18 PM | Updated on Sep 26 2018 8:28 PM

BJP Chief Amit Shah Will Visit Telangana In October Says K Laxman - Sakshi

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు నాయకుడు ఆర్‌.కృష్ణయ్యకు బీజేపీ స్వాగతం పలుకుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఆర్‌.కృష్ణయ్య పార్టీలోకి వస్తానంటే ఎంపీ టికెట్‌ ఇవ్వడానికైనా సిద్దమేనని వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అక్టోబర్‌ మొదటి వారంలో 30 అభ్యర్థులతో కూడిన మొదటి జాబితా ప్రకటిస్తామని తెలిపారు. అదే నెలలో అమిత్‌ షాతో కరీంనగర్‌, వరంగల్‌లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు.

టీజేఎస్‌, తెలంగాణ ఇంటిపార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు ఊగిసలాడుతున్నారని అన్నారు. ఇంటి పార్టీ నేతలు యెన్నం శ్రీనివాస్‌తో సహా పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామనీ, షరతులు లేని చేరికలు ఉంటాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా యువ సమ్మేళనాలు నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement