ప్రజ్ఞ ఠాకూర్‌పై నితీష్‌ ఫైర్‌

Bihar CM Nitish Kumar Fires On Pragya Thakur - Sakshi

పట్నా: భోపాల్‌ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ప్రజ్ఞా ఠాకూర్‌పై బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తీవ్రంగా మండిపడ్డారు. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను దేశ భక్తుడంటూ  ప్రజ్ఞా ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలను నితీశ్ కుమార్‌ ఖండించారు. గాంధీపై  ఆమె చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ఈ వ్యాఖ్యలు ఖండించతగ్గవి. ఇటువంటి తీరును మేము సమర్థించం. గాంధీ జాతిపిత. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారో, లేక చర్యలు తీసుకుంటారన్నది ఆపార్టీకి సంబంధిచిన విషయం. ఇలాంటి వ్యాఖ్యలను ఎవరూ కూడా ఉపేక్షించకూడదు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజ్ఞా ఇటీవల మాట్లాడుతూ... ‘గాంధీని హత్య చేసిన గాడ్సే ఓ దేశభక్తుడు.. ఆయనను కొందరు ఉగ్రవాది అని అంటున్నారు. అటువంటి వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు’ అని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగుతున్న విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top