కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్యానికి అవసరం : భట్టి

సాక్షి, హైదరాబాద్ : హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్యానికి అవసరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. హుజూర్‌నగర్ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందనీ ధీమా వ్యక్తం చేశారు. గెలిచే అభ్యర్థినే పార్టీ ప్రకటిస్తుందని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి గెలవాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రజలకు ప్రతిపక్షం చాలా అవసరమని, కాంగ్రెస్‌కు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరారు.
(చదవండి : మహారాష్ట్ర, హర్యానాలో మోగిన ఎన్నికల నగారా)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి